logo

కొత్తగూడెం ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్

సింగరేణి వ్యాప్తముగా 11 ఏరియాలలో ప్రతీ ఏడాది నిర్వహించే సమ్మర్ క్యాంప్ లలో భాగముగా ఈ ఏడాది కూడా సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యం లో 2024-25 సంవత్సరంకు గాను 18 సంవత్సరాల లోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు (బాలురు మరియు బాలికలకు) మరియు కొత్తగూడెం పరిసర ప్రాంతాల పిల్లలకు ఈ నెల 26 వ తారీఖు నుండి 20.05.2024 వరకు అనుబవజ్ఞులైన శిక్షకులచే సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడునని ఆసక్తి కలిగిన సింగరేణి ఉద్యోగస్తుల పిల్లలు (బాలురు మరియు బాలికలు) 26.04.2024 శుక్రవారం ఉదయం 10.30 గంటల లోపు కొత్తగూడెం ఏరియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కు వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు గారు పత్రికా ప్రకటన లో భాగముగా తెలియజేయడం జరిగింది.
ఈ క్రింద తెలిపిన సమయాలలో తేదీ: 26.04.2024 నుండి 20.05.2024 వరకు ఆయా వేదికలలో జరుగునని తెలియజేయడమయినది.
క్రమ సంఖ్య క్రీడ స్థలం ఉదయం సమయం సాయంత్రం సమయం
1 ఫుట్ బాల్ , సాధన గ్రౌండ్స్ రామవరం, ఉదయం 6.00 గం - 8.00గం వరకు సాయంత్రం 5.00 గం - 6.30 గం వరకు
2 వాలీ బాల్, సి‌ఈ‌ఆర్ క్లబ్, రుద్రంపూర్ 6.00 గం - 8.00గం వరకు సాయంత్రం 5.00 గం - 6.30 గం వరకు
3 అథ్లెటిక్స్, ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, గౌతమ్ పూర్ 6.00 గం - 8.00గం వరకు సాయంత్రం 5.00 గం - 6.30 గం వరకు
4.కిక్ బాక్సింగ్, రెస్క్యూ గ్రౌండ్స్ 3ఇంక్లైన్, 6.00 గం - 8.00గం వరకు సాయంత్రం 5.00 గం - 6.30 గం వరకు
5 హాకీ, ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, గౌతమ్ పూర్ 6.00 గం - 8.00గం వరకు సాయంత్రం 5.00 గం - 6.30 గం వరకు
పైన తెలిపిన ఆటలలో ఆసక్తి గల ఉద్యోగుల పిల్లలు ఆయా వేదికలలో, పైన తెలిపిన తేదీలు మరియు సమయాలలో పాల్గొని, క్రీడలలో నైపుణ్యం సంపాధించి ఈ వేసవి సెలవులను సద్వినియోగ పరచుకోవలసినది గా కొరడమైనది. పర్సనల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా

1
45 views